వెండితెర తారల్లో చాలా మంది కి పెట్టు అంటే పెంపుడు జంతువులు ఉన్నాయి .ఇన్ స్టా లో పెట్స్ తో ఫోజులు ఇస్తూ కనిపించే హీరోయిన్లకు కొదవలేదు. దక్షిణాది హీరోయిన్ అంజలి పెట్ పేరు పోలో. ఈ బుల్లి కుక్క పిల్ల తో ఉన్న తన ఫొటోను షేర్ చేసి డియర్ పోలో  నువ్వు నా జీవితం లోకి బోలెడంత సంతోషం తెచ్చావు ఐ లవ్ యు అని క్యాప్షన్  పెట్టింది అంజలి. ఆమె అభిమానులు అంతా ఇప్పుడు పోలోకి ఫ్యాన్స్ అయ్యారు. తెలుగు హీరోలతో సమానంగా క్రేజ్ ఉన్న హీరోయిన్ సమంత. ఆమెకి ఇష్టమైన పెట్ డాగ్ హాష్. ఆమె వర్క్ వుట్స్ చేస్తూ ఉంటే దగ్గరే పరిగెడుతూ ఉంటుంది హాష్. దానికి బెస్ట్ డాగ్ ఎవ్వర్ అని ముద్దు చేసింది సామ్. రష్మిక ఓ బుజ్జి కుక్క పిల్లను దత్తత తీసుకుని తనను పెట్ మామ్ అని చెప్పుకుంటుంది. దాని పేరు ‘ఆరా’ ఆ కుక్కపిల్లను తన ట్రావెల్ పార్టనర్ గా చేసుకొంది రష్మిక .కీర్తి సురేష్ క్లోజ్ ఫ్రెండ్ నైక్ నలుపు తెలుపు రంగుల్లో ఉండే నైక్ ను ఎత్తుకుని ఇన్ స్టా లో నైక్ డైరీస్ హాష్ ట్యాగ్ లో పోస్ట్ లు పెడుతోంది కీర్తి. పూజా హెగ్డే కు తన పెట్ అంటే ప్రాణం. బ్రూన్ కోసం ప్రత్యేకం ఆహారం వండిస్తోంది ఇంకా ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు పెట్స్ తో అనుబంధం పెంచుకొన్నవాళ్ళే .

Leave a comment