అచ్చంగా లంగా ఓణీ వేసుకున్నట్లే ఉంటుంది షరారా శారీ డ్రెస్. ఇది సంప్రదాయ లక్నో డ్రెస్. ఉత్తర ప్రదేశ్ నవాబులు కుటుంబాల్లో డైలీ డ్రెస్ ఇది. టాప్ గా షర్ట్ కుర్తి బాటమ్ గా షరారా ప్యాంట్ వేసుకుంటారు. దీన్ని కాస్త మార్చి శారీ స్టయిల్ చేశారు ప్యాషనిస్టులు. పండుగలు, వివాహ వేడుకల్లో ఇది ప్రత్యేక ఆకర్షణ. సంప్రదాయ చీరెకట్టును స్టైలిష్ లుక్ తో చూపెడుతోంది షరారా శారీ. ఫ్లోరల్ ప్రింట్ టాప్ టు బాటమ్ సేమ్ కలర్ తో ఈ షరారా శారీ సెట్ చాలా బావుంటుంది. చక్కని మెరిసే ఎరుపు పసుపు రంగులు షరారా డ్రెస్ కు సరైన ఎంపిక ఎంబ్రాయిడరీ బ్లౌజ్, సాంప్రదాయ ఆభరణాలు షరారా డ్రెస్ వేడుకల్లో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. శరీరాకృతి ఫిట్ తో ఉంటే ఈ డ్రెస్ ఎంతో అందంగా ఉంటుంది. టాప్ గా షర్ట్ కుర్తీ లేదా స్లీవ్ లెస్ ల్యూనిక్ వేసుకుంటే చాలా స్టైల్ లుక్ వస్తుంది. షరారా వట్టి ప్యాంట లాగా కాకుండా ఎక్కువ కుచ్చులు ఉంటే అచ్చం చీర కట్టుకొన్నట్లే ఉంటుంది. డిజైనర్ బ్లౌజ్ ఉండి పూర్తిగా కుచ్చులతో సరదాగా ఉండే షరారా శారీ ఇంకా ఎంతో ముచ్చటగా కనిపిస్తుంది. లాంగ్ ఓణీ వేసుకున్నట్లు. ఇటు చీరె కట్టుకున్నట్లు హుందాతనం తోను ఈ డ్రెస్ ఇండో వెస్ట్రన్ లుక్ తో ఉంటుంది. అదే సమయంలో పూర్తి ట్రెడిషనల్ గాను ఉంటుంది చీర కట్టడం ఇష్టమైతే ఈ అడ్రస్ ఆ కోరిక తీర్చేస్తోంది.
Categories