తెలంగాణ ఉద్యమ గీతాలు జానపద గీతాలు యూట్యూబ్ కోసం పాడేదాన్ని కానీ ఊహించని అవకాశం నా తలుపు తట్టింది. జానపద గాయని గా ఉన్నా నన్ను సామి సామి పాట తో ప్రపంచానికి పరిచయం చేశారు దేవి శ్రీ ప్రసాద్. సినిమా పాట పాడటం అంత ఈజీ కాదు ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. పదేళ్ల కష్టానికి ఫలితం పుష్పా సినిమా కోసం నేను పాడిన పాట అంటుంది మౌనిక యాదవ్ పుష్ప సినిమాలో పాడిన సామి సామి పాట తో ఓవర్ నైట్ స్టార్ సింగర్ అయిపోయింది మౌనిక. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమ గీతాలు పాడేవాళ్ళం తెలంగాణ సాంస్కృతిక సారధి లో నాకు మా అక్కకు ఉద్యోగాలు వచ్చాయి ప్రభుత్వ స్కీమ్ లు జనాల్లోకి తీసుకుపోయే చైతన్య పరచడం మా పని అంటోంది మౌనిక యాదవ్.