Categories

స్త్రీ లలో మోనోపాజ్ సమయంలో ఎక్కువ ఎదురయ్యే సమస్య బ్రెయిన్ ఫాగ్, ఈ సమస్య వారికి కెరీర్ కే సవాల్ గా మారుతుంది అంటున్నారు. మెల్ బోర్న్ లోని మోనాష్ విశ్వవిద్యాలయాల అధ్యయనకారులు, ప్రతిదీ మరచిపోవటం అయోమయం దేనిపైనా దృష్టి పెట్టలేక పోవడం దిగులు పడటం, ఈ పరిస్థితినే బ్రెయిన్ ఫాగ్ అంటున్నారు. నెలసరులు పూర్తిగా ఆగిపోయిన దశలో దాదాపు సగం మంది జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నారు చాలామందికి ఎదుటి వ్యక్తి పేరు కూడా చెప్పినా స్పురణకు రాక సతమతం అవుతుంటారు. అండాశయాలు విడుదల చేసే ఒక రకం హార్మోన్ విడుదల ఆగిపోయి అది మెదడుపై ప్రభావం చూపించటమే ఈ పరిస్థితికి కారణం అంటున్నారు. ధ్యానం చేయటం, అనవసర మందుల వాడకం తగ్గించడం మార్గాలని సూచిస్తున్నారు.