నేను 13 కిలోల బరువు తగ్గాను అదే గొప్ప అచీవ్మెంట్ అంటుంది అవికా గోర్. అద్దంలో నన్ను నేను చూసుకుంటే గుండె పగిలింది లావెక్కిన కాళ్లు చేతులు పెరిగిన పొట్ట పైగా నాకు పీసీఓడీ థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి. పనిలో పడి నా శరీరాన్ని పట్టించుకోలేదు పెరిగిన బరువు తో త్వరగా అలసి పోయేదాన్ని అప్పుడు ఇక మంచి ఆహారం పైన దృష్టి పెట్టాను అంటుంది అవికా గోర్. డాన్స్ చేయటం ముఖ్యంగా చిరు తిండి పైన ధ్యాస వదిలించుకోవటం నన్ను నేను ప్రోత్సహించుకోవటం నా బరువు తగ్గించుకోగలను. ఇది ఎవరి వల్ల అయినా అవుతుంది ముందు ఆరోగ్యంగా ఉండాలన్నా బరువు తగ్గాలి కదా అంటోంది అవికా గోర్.

Leave a comment