పిల్లలున్న గదిని అందంగా, ఖరీదైన మంచాలు వస్తువులతో నింపే బదులు వాళ్ళ సృజనా శక్తి పెరిగేలా అలంకరించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వాళ్ళలో హుషారుని చురుకు దనాన్ని పెంచాలి గదిలో వస్తువులు వాళ్ళ గది హరివిల్లు వర్ణాలతో వుండాలి. అది అద్దె ఇల్లుయినా సరే ఒక వైపు పూర్తిగా బ్లాక్ బోర్డులు నింపేయండి. లేదా ఒక గోడనే నల్ల బల్లగ మలిచేయాలి. చేతిలో చాక్ పీస్ వుంటే వాళ్ళు ఎదో ఒకటి రాస్తూ గీస్తూ ఉంటారు. చక్కని జంతువులు చెట్లు మార్బుల్స్ తో గది గోడలపై ఒక పచ్చని వాతావరణం సృష్టించి ఇవ్వచ్చు. పెద్ద మ్యాప్ వేయించి ఇవ్వచ్చు. వాళ్ళకి భౌగోళిక అంశాల పైన అవగాహన వస్తుంది. అయితే ఎలాటి అలంకరణలు చేసిన వాళ్ళు గాయిపడే అంచులు వాడిగా గుచ్చుకోనేవి ఎవీ లేకుండా జాగ్రత్త పడాలి. పరుగు తీయడమే కానీ జాగ్రత్తలు ఎరుగరు.

Leave a comment