Categories
రాత్రి పూత కనీసం ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. ఆరుగంటలు ఖచ్చితంగా నిద్ర వుండకపోతే అనారోగ్యం అంటారు కానీ,ఆరుగంటలకు ఎనిమిది గంటల నిద్రకు తేడా వుంటుంది. శరీరంలో తేమ శాతాన్ని నియంత్రించే హార్మోన్ విడుదలకీ సంబంధం ఉంటుంది. ఆరుగంటలే నిద్ర పోయె వాళ్ళలో జీవ గడియారం దెబ్బతిని,వాసోప్రెనీస్ అనే హార్మోన్ విడుదల సరిగ్గా ఉండదు దానితో ఎనిమిది గంటలపాటు నిద్రపోయే వాళ్ళ కన్నా మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్ళటం తో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతోంది అదే ఎనిమిది గంటలు నిద్ర పోయే వాళ్ళలో వాసోప్రెనీస్ విడుదల సరిగ్గ ఉండి శరీరం నీటిని నిల్వ చూసుకొనే సామర్థ్యం తో ఉంటుంది. ఫలితంగా నిద్ర మధ్యలో ఎక్కువ సార్లు లెవరు డీహైడ్రేషన్ కూడా రాదు.