అందమైన నెక్లెస్ లు షో రూమ్ లో కనువిందు చేస్తాయి. దేన్నీ ఎంచుకుంటే ఏ డ్రెస్ పైకి బావుంటుంది. వెడల్పాటి హాల్డెడ్ నెక్ డ్రెస్ ధరిస్తేనే త్రికోణాకారంలో మెదకిండగా జారినట్లు వుండే నెక్లెస్ బావుంటుంది. నెక్ లైన్ టాప్  వేసుకుంటే మెడను హైలైట్ చేసే నెక్లెస్ ధరించాలి. తర్తిల్ నెక్  లైన్ కు పొడవాటి చెయిన్, అక్కడక్కడా స్టోన్స్ పొడిగినవి వేసుకోవాలి. స్క్వేప్ నెక్ లైన్ కు యాంగులార్ నెక్ లెస్ కరక్టగా సరిపోతుంది. ఇక వి నెక్ కోసమైతే మెడకు స్మ్పుల్ గా వుండే చిన్ని పెండెంట్ సరిపోతుంది. ఈ నెక్  కు నాజుకైనా సన్నటి జ్యువెలరీ బావుంటుంది. ట్యూబ్ టాప్ నెక్ లైన్ కు చోకార్ చాలా బావుంటుంది. ఇక కాలర్ వుండే టాప్స్ పైకి స్టేట్ మెంట్ జ్యువెలరీ అట్రాక్టివ్గా వుంటుంది. ఇలాంటి స్టయిల్ టిప్స్ కోసం ఖరేదైనా నాగ కొనే ముందర స్టయిలిస్టుల సలహా తీసుకోవడం మంచిదే.

Leave a comment