కాస్సేపయినా బయట నడిచే అవకాశం లేక కీళ్ళనొప్పులు వస్తాయి ఈ నొప్పుల ఉపశమనం కోసం యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. లాక్ డౌన్ కారణంగా కొన్ని కొన్నే పండ్లు దొరికే అవకాశం ఉంది. ఏవి దొరికే అన్ని రకాల పండ్లు క్యారెట్లు,బిట్ రూట్,కాప్సికం,బీన్స్ చిక్కుళ్ళు అన్ని రకాల ఆకు కూరలు సలాడ్స్ రూపంలో సూప్ గానో తీసుకోవచ్చు. పసుపు,అల్లం వెల్లులి తప్పనిసరిగా వాడాలి. పాలిష్ చేసిన తెల్లని బియ్యపు అన్నం,మైదాతో చేసిన పదార్ధాలు బేకరీ ఫుడ్స్,పచ్చళ్ళు,స్వీట్లు,కాఫీ వంటివి కాస్త పరిమితం చేసుకోవాలి. తక్కువ కొవ్వు ఉండే కోడి,చేప వంటివి తీసుకొంటే మంచిది ఒమేగా-3 వుండే చేప అవిసె ఆక్రోట్ గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆహారం తో పాటు ఇంట్లోనే చేయగలిగిన వ్యాయామాలు చేయాలి.

Leave a comment