అమ్మ అన్న రెండక్షరాల తీయదనం ఎన్నో సార్లు నోరారా పిలిచినా తగ్గదు. ఆమె సాంప్రదాయపు అమ్మ మాత్రమే కాదు. ఇప్పుడు యూత్ అంటే మదర్ టాటూ అరాధకులు మారారు. అమ్మలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో ఈ మదర్ టాటూ లో అన్ని రంగులున్నాయి. వర్ణ శోభితమైన అమ్మ టాటు ఇప్పుడు స్టైల్ ఐకాన్. సాంప్రదాయ సింబల్స్ తో కూడిన క్లాసిక్  మాంమ్ టాటు డిజైన్లు వేయించుకుంటున్నారు. హార్ట్స్, బర్త్ స్పాట్స్ లాంటి క్లాసిక్ సింబల్స్ వుంటే కొందరు జస్ట్ మదర్ అన్న టాటూ కు మొగ్గుతున్నారు. భక్తి, ఆధ్యాత్మికత వుండేవాళ్ళు దేవుడి సింబల్స్ ఎంచుకుంటారు. అలాగే మత గ్రంధాల్లోని ఏ ప్రభుత్వ వన్యాలు కూడా ఇప్పుడు టాటూ డిజైన్లు గా వస్తున్నాయి. ఇష్టమైన జ్ఞాపకాలు, అభిరుచులు తెలిపే టాటూలు కొందరు ఇష్టపడితే, ఎక్కువ మంది మొగ్గేది మాత్రం అమ్మ పైన ప్రేమతో మదర్ టాటూ లకే.

Leave a comment