హెయిర్ యాక్సిసరీలు ఫ్యాషన్ స్టయిల్ లో ముందే ఉంటాయి. హెయిర్ స్టయిల్ కు కొత్త అందం తెస్తాయి. సాధారణ హెయిర్ బ్యాండ్స్ కూడా స్టయిల్ స్టేట్మెంట్స్ లాగా వస్తున్నాయి. ఇప్పుడివి ఎక్స్టెన్ షన్ లకు అవసరం అవుతున్నాయి. సాదా కలర్ లో లేదా ప్రింటెడ్ బ్యాండ్స్ పగటి వేళలకు బావుంటాయి. ఫెదర్లు, సెక్విన్లు, జ్యూయిల్డ్ బ్రాండ్స్ ప్రత్యేక సందర్భాలకు నప్పుతాయి. అలాగే చిన్నా పెద్దా హెయిర్ క్లిప్స్ రకరకాల ప్రింట్స్ ఆకృతుల్లో రొజువారీ దుస్తులకు చక్కగా మ్యాచ్ అవ్వుతాయి. మెరుపులు, పువ్వులు, రాళ్ళూ తదితర రకాలుగా లభిస్తూ ప్రతి సందర్భానికీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. సరదాగా కనబడేవి సొంతంగా చేసుకోవచ్చుకుడా. బ్లాక్ ఎలాస్టిక్ హెడ్ బ్యాండ్, రంగుల బటన్లు నీడిల్, నల్లదారం, కట్టిరతో అద్భుతాలు చేయొచ్చు. హెడ్ బ్యాండ్ అంతటా రంగుల బటన్లు గుచ్చి కుట్టేస్తే ఏ డ్రెస్ మ్యాచింగ్ కైనా సరిపోయేలా ఉంటాయి. ఎటొచ్చీ బటన్ల ఎంపికలో కొత్తదనం చూపించాలి.

Leave a comment