వారానికి రెండు సార్లు హెయిర్ ఫ్యాక్స్ వేస్తువుంటే జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉంటుందంటున్నారు ఎక్సపర్ట్స్. గుడ్డులోని తెల్లసొన స్పూన్ తేనె రెండు స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె ని బాగా కలిపి ఈ మిశ్రమంతో ప్యాక్ వేసుకోవచ్చు. రెండు స్పూన్ల ఓట్స్ కప్పు పచ్చిపాలు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపినా మంచి ప్యాక్ తయారవుతోంది. జుట్టు మాడు జిడ్డుగా ఉంటే బాగా పండిన అరటిగుజ్జు తేనె,కొంచెం పాలు కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి ఓ అరగంట ఆగి తలస్నానం చేస్తే బావుంటుంది. పాచి కొబ్బరిపాలు,టీస్పూన్ ఆలివ్ నూనె,కోడిగుడ్డు తెల్లసొన బాగా కలిపి మిశ్రమంతో హెయిర్ ప్యాక్ వేసుకొని అరగంట ఆగి గోరు వెచ్చని నీళ్ళలో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment