సచిన్ టెండూల్కర్ ప్రపంచం మెచ్చిన క్రీడాకారుడు.ప్రతి ఇంటా ఆయన అభిమానులు ఉన్నారు.ఆయన అభిమానుల ఆపేక్షను వారసత్వంగా తెచ్చుకుంటుంది సారా. సచిన్ కూతురుగా ఈ అమ్మాయి అటు క్రీడల్లోని,ఇటు సినిమాల్లోకి రాలేదు. చదువు పైన దృష్టి పెట్టింది. నాయనమ్మ అనాబెల్ సేవాభావాన్ని అందిపుచ్చుకుంది అప్నాలయ సంస్థ కోసం విరాళాలు సేకరించటం సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోవటం సారా కు ఇష్టమైన పనులు. 1972 లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబాయి లో ఉంది మురికివాడల్లోని పేదలు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తుంది అప్నాలయ సచిన్ కుమార్తె సారా. ఈ సంస్థ కోసం ఎన్నో విధాలా  సాయంగా ఉంటుంది.

Leave a comment