ఒక శుభకార్యం మొదలు పెట్టాలి అంటే తిథి వార నక్షత్రాలు సరి చూసుకుంటారు.అలా ఒక మంచి ముహూర్తం లో మొదలు పెట్టిన ప్రతి పని విజయవంతం అవుతోంది. చాలామంది అమావాస్య నాడు ఏ పని మొదలు పెట్టారు ఆ రోజు మంచిది కాదని అనుకుంటారు.అని మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్యనాడు ప్రారంభించారు విజయాన్ని సాధించారు అధర్మాన్ని జోడించి ధర్మాన్ని గెలిపించిన మంచి ముహూర్తం అది.ఇప్పుడో కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజే. ఆ రోజు కోసం ఎదురు చూసి మరీ పనులు మొదలు పెడతారు శుభకార్యాలు జరుపుకుంటారు. ఒకరకంగా ఆలోచిస్తే విజయం ముహుర్తానిది కాదు.  మన సంకల్ప బలానిది.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134 

Leave a comment