ఈ ఎండల్లో చల్లగా ఎనర్జీ ఇచ్చే పానీయం పానకం ఒక్కటే శ్రీరామ నవమికి చేసే పానకం ఈ వేసవి రోజుల్లో ప్రతి రోజు తాగినా ఏ ప్రాబ్లం రాదు. ఒక్క గిన్నెలో బెల్లం కొట్టి పడేసి కాసిన్ని నీళ్ళు పోసి పెడితే కరిగిపోతుంది. కరిగాక కావలసినన్ని బెల్లం తీయదనం సరిపోయే వరకు కలపాలి. ఆ నీళ్ళను వడపోస్తే నలకలు పోతాయి. వడకట్టిన నీళ్ళల్లో  నిమ్మరసం, శొంటి పొడి, యాలుకల పొడి, నల్ల మిరియాల పొడి ఉప్పు వేసి కలపాలి. పచ్చ కర్పూరం వేస్తె ఇంకా ఘుమఘుమలాడి పోతుంది. తులసి ఆకులూ కూడా వేయాలి. ఇవి ఫ్రిజ్ లో వుంచి కూడా తాగొచ్చు. మిరియాల పొడి, యాలుకల పొడికి కొలతలు ఏవీ వుండవు మనం ఇస్తాపడెంత ఘాటు రుచి చూస్తూ కలుపుకోవాలి. లేక పొతే అందరు మిరియపు ఘటును ఎంజాయ్ చేయకపోవచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిది.

Leave a comment