Categories
Gagana

నా ఆత్మ విశ్వాసాన్ని గర్వం కింద తేల్చారు.

కంగనా రనౌత్ ను క్వీన్ అంటారు. జీవితంలో కొన్ని విషయాల పట్ల స్పష్టత లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత నిజం అవుతుంది అంటుంది కంగనా. ‘ నేను పుట్టినప్పుడు మళ్ళీ అమ్మయేనా అని మా అమ్మ చాలా నీరస పడిందట. సినిమాలను కెరీర్ గా చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి నచ్చాక్ పోయే సరికి ఇల్లు వదిలి వచ్చేసాను. నన్ను డాక్టర్ ను చేద్దాం అనుకున్నారు. వాళ్ళు. కానీ జబ్బు పడిన వాళ్ళకి చికిత్స చేసే ఆలోచన నన్ను డిప్రెషన్లోకి నెట్టేది. బి గ్రేడ్ సినిమాల తో మొదలు పెట్టిన నేను ఇవ్వాళ నెంబర్ వన్ నటిని. ఈ ప్రయాణంలో ఎంత మందిని కలిసానుచాలా మందికి జీవితంలో అబద్రతే. డబ్బు అన్నింటినీ కొనలేదు అంటారు. కానీ నాతల్లిదండ్రుల కు ఇవ్వాల నేను సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చాను అంటే డబ్బు తో నే. కెరీర్ ప్రారంభంలో నేనెంతో ఇన్ సెక్యూర్డ్ గా వుండే దాన్ని. నా టాలెంట్ పైన నమ్మకం వుండేది కాదు. నెమ్మదిగా నాలో వున్న శక్తిని నేను అర్ధం చేసుకున్నాక నాకూ ధైర్యం వచ్చింది. ఆ అధిర్యం నా మాటల్లో చేతల్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం మాట్లాడినా అదో వివాదం అయ్యి కూర్చుంటుంది. నేను ఆత్మవిస్వాసంతో ఉంటా. అది గర్వం అంటారు. అంటుంది కంగనా.

Leave a comment