రసాయనాలు లేని లిప్ బామ్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మూడు స్పూన్ల దానిమ్మ గింజల రసాన్ని రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపి ఐదు నిమిషాలు చిన్న మంటపై వేడి చేస్తే ఆ మిశ్రమం దగ్గర పడుతుంది. దాన్ని గా ఓ గాజు గిన్నెలో తీసుకుని చల్లారనిస్తే మంచి లిప్ బామ్ సిద్ధం. ఒక స్పూన్ పెట్రోలియం జెల్లీ లో రెండు స్పూన్ల బీట్ రూట్ పౌడర్ కలిపి ఒక పాత్రలో నీళ్లు మరగనిస్తు దాన్లో ఈ పాత్ర ను ఉంచి బాగా కలిసేదాకా కలపాలి. దాన్ని చిన్న పాత్రలోకి తీసుకుని ఆరనిస్తే మంచి రంగులో ఉన్న లిప్ బామ్ సిద్ధం. ఇది పెదవులకు తేమను మంచి రంగును ఇస్తుంది.

Leave a comment