ప్రతి మహిళా బాలిక స్వీయ రక్షణ మార్గాలు నేర్చుకోవాలి. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ కు చాలా శక్తి కావాలి. ఆడపిల్లలు ప్రాక్టీస్ చేస్తే లాలిత్యం కోల్పోతారు అన్నది కేవలం అపోహ. ఈ ప్రాక్టీస్ తో దేహం శక్తిమంతంగా తయారవుతుంది. నైట్ డ్యూటీలు, షిఫ్ట్ లు చేసే వాళ్ళు తప్పనిసరిగా స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోవాలి అంటారు కరాటే ఛాంపియన్స్ సైదా ఫలక్. 20 నేషనల్, 22 ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ లో గెలిచిన ఈ తెలంగాణా చాంపియన్ 12 ఏళ్ల వయసు నుంచి కరాటే ప్రాక్టీస్ మొదలు పెట్టారు తెలంగాణ స్కూళ్ల లో ఆమె బాలికలకు స్వీయ రక్షణ నేర్పిస్తున్నారు.

Leave a comment