ఎండలో వేడి తో పాటు అనారోగ్య సమస్యలు వస్తాయి. రోగ నిరోధకత పెంచుకోవాలంటే కొన్ని పోషకాలు తీసుకోవాలి. కర్బూజ లో శరీరానికి కావలసిన నీరుంటుంది. దీన్లోని ఫైబర్, విటమిన్-సి, బి6  ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. బొప్పాయి, నారింజ, స్ట్రాబెర్రీ, నిమ్మ,  పుచ్చకాయలో బీటా కెరోటిన్, సి, ఇ,కె విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీడి నుంచి తట్టుకునేందుకు సొర, బెండ, తోటకూర, పుదీనా వంటివి ఎక్కువగా తినాలి. టమోటో లో ఉండే లైకోపిన్ వేడి నుంచి రక్షణ ఇస్తుంది. క్యాబేజీ, కీరా దోస ల్లో నీరు ఎక్కువ.ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. పెరుగు, మజ్జిగ మొదలైనవి ఇమ్యూనిటీ ని పెంచుతాయి.

Leave a comment