చెద పురుగులు పెట్టిన పుట్టలు లాగా ఉంటాయి ఈ ఇల్లు.ఇరాన్ లోని కొండోవన్ అనే ఉరికి వెళితే ఈ గుహల్లాంటి వెళితే జనావాసాలు కనిపిస్తాయి. కొన్ని వేల సంవత్సరాల కిందట వెలువడిన లావా బూడిద వంటి వాటితో ఇక్కడ రాతి శిలలు ఏర్పడ్డాయి. 700 ఏళ్ళ క్రితం వాటిని గుహల్లా తొలిచి ఇళ్లు గా మార్చారు రాళ్ల ఇళ్లలో కిటికీలు, తలుపులు, మెట్లు, ఇట్లా ఓ ఇంటికి కావలసిన సౌకర్యాలన్నీ ఉంటాయి. తరతరాలుగా వాటిల్లోనే జీవిస్తున్నారు. ఈ ఇల్లు వేసవిలో చల్లగా చలికాలంలో వెచ్చగా ఉంటాయి. ఏడు వందల మంది జనాభా ఉన్న ఈ ఊర్లో బడి, మసీదు వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

Leave a comment