నీహారిక,

టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులు, చాలా మంది, మా పిల్లలు మీకు అర్థం కావటం లేదనీ, మాట వినటం లేదనీ కంప్లెయింట్ చేస్తారు. కానీ వాళ్ళు మరచి పోయిన విషయం ఏమిటంటే తమ టీనేజ్ లో తాము అలాగే ఉన్నామని. అప్పటికి, పిల్లలు టీనేజ్ నాటికి ఎంతో వ్యత్యాసం ఉందని అర్థం చేసుకొంటే సమస్యే లేదు. మారే కాలం తో పాటు నడవాలి. పిల్లల స్నేహితులతో కూల్ గా ఉండాలి. డెడ్ లైన్లు మార్చడం, వాళ్ళ పైన ఆంక్షలు ఎత్తేయటం చేయి వలసి వస్తుంది. ప్రతిసారి తప్పు పట్టటం, అస్తమానం జడ్జ్ మెంట్స్ ఇవ్వటం పిల్లలకు నచ్చక పోవచ్చు. పేరెంట్స్ ఎప్పుడు పాటాలే చెపుతారు కనుక స్నేహితులకు దగ్గరగా ఉంటారు. పేరెంట్స్ ఆ స్నేహితులను తప్పు పట్టటం వదిలేసి, తమ పిల్లలకు బెస్ట్ ఫ్రెండ్స్ కావాలని చూడాలి. వారు ధైర్యంగా మనసులో మాట చెప్పుకొనే భరోసా ఇవ్వాలి. ఈ టీనేజీ దశను పెద్దవాళ్ళు శ్రద్దగా దాటించ గలిగితే పిల్లలకు సొంతగా నిలబడి ఆలోచించుకొనే శక్తి తెలివితేటలు వస్తాయి. అంచేత తల్లిదండ్రులే, సంయమనంతో, ఓర్పుతో పిల్లల పట్ల మెలగాలి.

Leave a comment