కడుపులో ఉన్న బిడ్డకి, గర్భవతి గుండెల్లో మంటకి అవినాభావ సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు . గుండెల్లో మంట,వాంతులతో బాధపడే తల్లులకు పుట్టే బిడ్డ జుట్టు ఒత్తుగా, పోడవుగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఇలాంటివి ఇళ్ళల్లో పెద్ద వాళ్ళు అంటూ ఉంటారు. గర్భవతులనూ చూసి అనుభవంతో కొన్ని నిర్ణయాలు చేస్తారు పెద్ద వాళ్ళు. పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే కడుపులో ఉన్న బిడ్డ మంచి రంగులో పుడతాడని పెద్దవాళ్ళు అంటారు. శాస్త్రీయంగా దానికి రుజువు లేకపోయినా ఆరోగ్యం దృష్ట్యా కుంకుమ పువ్వు వేసిన పాలు తాగటం మంచిదే . ఇలాంటి వన్ని పరిశోధనలు చేసి కొన్ని నమ్మకాల్లో వాస్తవం ఉందని తేల్చారు పరిశోధకులు.

Leave a comment