దేవతల్లా అలా గాలిలో ఎలా ఎగురుతున్నారు ఈ అమ్మాయిలు అని ఆశ్చర్యం వేస్తుంది ఏ ఆధారం లేకుండా గాలిలో ఎగరడం సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నారు జియాటియన్ పార్క్ నిర్వాహకులు చైనాలోని ఫుజియాన్ లో జియాటియన్,జియా పర్యాటక ప్రాంతానికి వెళితే ఎవరైనా ఇలా గాలిలో ఎగిరే అనుభవం పొందచ్చు. పూర్వం ప్రాచీన చైనాలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రవీణ్యం ఉన్నవాళ్లు తేలికగా గాల్లో ఎగిరే వాళ్లనే కథలున్నాయి .ఉగ్జియా పేరుతో ఇలాంటి స్టంట్స్ చేసే ఫిక్షన్ సినిమాలు ఎన్నో వచ్చాయి కూడా. ఉగ్జియా అంటే మార్షల్ హీరోలు. అలా సినిమాల్లో హీరోల్లా ఎగరాలి అని సరదా పడేవాళ్ళ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిందే. ఈ జియాటియన్ పార్క్ ఇక్కడ కనిపించే కొండలు, అడవులు, జలపాతాలు అచ్చం సినిమా సెట్టింగ్స్ లాగే ఉంటాయి .గాల్లో ఎగరాలంటే సన్నటి స్ప్రింగ్ లా ఊగే రబ్బర్ వైరు ని పైనుంచి వేలాడదీసి దాన్ని హీరో నడుముకు కట్టి సినిమా ఫైటింగ్స్ లో వాడినట్లే ఈ పార్క్ కి అలా గాల్లోకి ఎగరాలనుకుని వచ్చిన వాళ్లకు ప్రత్యేకమైన దుస్తులు ఇచ్చి ఈ స్ప్రింగ్ వైర్లను నడుముకు కడతారు. ఇవి సన్నగా పారదర్శకంగా కనిపించకుండా ఉంటాయి కనుక గాల్లో ఎగిరే వాళ్ళు ఎలాంటి ఆధారం లేకుండా అలా తేలిపోతున్నట్లు ఉంటుంది ఈ సరదా కోసం ఈ పార్క్ కి దేశ విదేశాలనుంచి వస్తారట మరి గాలిలో తేలి పోవటం అంటే మాటలా ?
Categories