స్మార్ట్ ఫోన్ ఉపయోగాలు చాలానే ఉన్నాయి.కానీ అస్తమానం ఫోన్ చూసే వ్యసనం మనుష్యుల మధ్య బంధాలను దారుణంగా దెబ్బ తీస్తాయని జార్జియా విశ్వవిద్యాలయం పరిశోధనలు చెపుతున్నాయి. నిరంతరం, భోజన సమయంలో కూడా ఫోన్ లోనే ఉండే వాళ్లలో డిప్రషన్ ఆందోళన వంటి లక్షణాలు క్రమేపీ వృద్ధి అవుతున్నాయి వాళ్ళు మనుషులతో నేరుగా ఐదు నిముషాలు కూడా మాట్లాడలేకపోతున్నారాని, ఇతరులతో దురుసుగా వ్యవహరిస్తున్నారని పరిశోధకులు చెపుతున్నారు.స్నేహితులతో గడిపేవాళ్లు సౌమ్యంగా మర్యాదగా ఉంటే ఫోన్ లో ఉండే వాళ్ళు స్నేహితులను కుటుంబ సభ్యులను దూరం చేసుకుంటూ విసుగుతో ఉన్నారని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఇప్పటికైనా ఫోన్ కాసేపు అవతల పెట్టి చుట్టు మనుషులతో  మాట్లాడండి అంటున్నారు పరిశోధకులు.

Leave a comment