ఎన్విరాన్మెంటల్ జర్నలిస్ట్ అయినా బహార్ దత్  పర్యావరణ అంశాలను గురించి ఎన్నో విలువైన వార్త కథనాలు రాశారు. ఆమె రాసిన  రివైల్టింగ్ ఇన్ ఇండియా గ్రీన్ వార్స్ ఎన్నో ప్రశంసలు పొందాయి జర్నలిస్ట్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న బహార్ దత్  ఎర్త్ టాక్స్ పేరుతో రీసెర్చ్ పౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు. డిల్లీలోని బాదల్ పూర్ గ్రామం మొత్తం పాములను ఆడించే వృత్తులోనే జీవిస్తున్నారని స్వయంగా చూసి వారి కోసం ప్రభుత్వంతో చర్చలు జరిగి ఉపాధి మార్గాలు చూపించింది. పాములు ఆడించే వాళ్ళు వాడే సాంప్రదాయ సంగీతాన్ని కాపాడేందుకు ‘ఎ హండ్రెడ్ చర్మర్స్’ పేరుతో మ్యూజికల్ బ్యాండ్ ను స్థాపించి ఆ వేదిక ద్వారా పాములు ఆడించే సమాజానికి చెందిన ఎంతో మందికి దేశవిదేశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించి కొనే అవకాశం కల్పించింది.

Leave a comment