Categories
అందమైన ఎర్రమందారం ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధం అంటున్నారు అమెరికా వ్యవసాయ శాఖ (యు ఎస్ డి ఎ) అధ్యయనకారులు. మందారం లో విటమిన్- సి యాంటీ యాక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచే రసాయనాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్యాన్సర్ మధుమేహం రానివ్వని ఔషధ లక్షణాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. ఎర్ర మందారాల పై జరిగిన అనేక అధ్యయనాల ఫలితం గా హైబిస్కస్ టీ పాపులర్ అయ్యింది. కొన్ని ప్రాచీన సంప్రదాయ పానీయాల్లో మందార తేనీటిని తాగుతూనే ఉన్నారు. పాలు చక్కెర కలిపిన టీ తాగడం కంటే ఆయుర్వేద గుణాలున్నా హైబిస్కస్ టీ ఇప్పుడు ఆధునికులను ఆకర్షిస్తుంది.