Categories
రెండేళ్ల పాటు హైకోర్టును ఆశ్రయించి చివరకు మొదటి మహిళా జేఎల్ఎం గా చరిత్ర సృష్టించింది. 21 సంవత్సరాల శిరీష సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం బిబ్బర్సీ గ్రామానికి చెందిన శిరీష మేడ్చల్ లో ఐ.ఐ.టి పూర్తి చేసింది ట్రాన్స్ కో లో లైన్ మెన్ పోస్టులు ఉండటంతో దరఖాస్తు చేసుకుంది. ఈమెతో పాటు 32 మంది మహిళలకు కూడా స్తంభం ఎక్కే పరీక్షలు ట్రాన్స్ కో నిర్వహించలేదు. శిరీష తో సహా ఎనిమిది మంది కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు. ఎనిమిది మీటర్ల ఎత్తున స్తంభాలను విజయవంతంగా ఎక్కి టీఎస్ఎస్పీడీసీఎల్ చరిత్రలోనే తోలి లైన్ ఉమెన్ గా ఉద్యోగం సాధించింది. సరికొత్త అధ్యాయానికి తెర తీసింది శిరీష.