డిపార్టుమెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రీషిన్ సైన్సెస్ జరిపిన అధ్యయనంలో  ఖార్జుర పండు మంచి శక్తి వంతమైనదిగా గుర్తించారు . ఉపవాస దీక్ష తీసుకొన్న వారు తక్షణ శక్తి కోసం  ఖార్జురం తింటారు . వీటిలో అతి సహజమైన షుగర్,గ్లూకోజ్,పెక్టోజ్ ,సుక్రోజ్ లు ఉండటం వల్ల వాటిని తిన్న వెంటనే ఎంతో శక్తి సమకూరుతుంది . ఎనర్జీ బార్స్,ఎనర్జీ డ్రింక్ ల కంటే ఇవి ఎంతో  మేలు సహజంగా ఉండే పీచు,పొటాషియం ,మెగ్నీషియం,విటమిన్లు,యాంటీ యాక్సిడెంట్స్ రోజంతా ఉల్లాసం గా ,ఉత్తేజంగా ఉండేలా చేస్తాయి . మెదడు పనితీరును మెరుగుపరిచే విటమిన్ బి,డి   ఖార్జురంలో సంవృద్ధిగా లభిస్తుంది . చక్కని నిద్రకు అవసరమయ్యే పెరటోనిక్ అనే పదార్ధం విటమిన్ బి,డి రూపములలో   ఖార్జురం పండ్లలో ఉంటుంది .

Leave a comment