శరీరం తీరు అందరికీ ఒకే రకంగా ఉండదు. అలాగే శరీరపు కొలతలు కరెక్ట్ గా ఉండాలని రూలేం లేదు. కొందరికి భుజాలు విశాలంగా ఉంటాయి. కొందరికి దవడ ఎముకలు ఎత్తుగా ఉంటాయి. ఇక మొహాలు రకరకాలు షేపులు. ఒకళ్ళకీ ఒకళ్ళకీ దాదాపు పోలికే ఉండదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని హైలైట్ కాకుండా చూడచ్చు . ఇప్పుడు విశాలమైన భుజాలున్నవాళ్ళు వస్త్ర ధారణ లో విశాలమైన పై భాగం కింద న్యారో బాడీల నడుమ చూసేందుకు వీలైన సమతౌల్య భ్రాంతిని కలిగించే జాగ్రత్తలు ఎంచుకోవాలి. భుజాలు సమంగా కనిపించే వస్త్రాలు ఎంచుకోవాలి. చూపు భుజాలవైపు వెళ్లకుండా చేసేలా షోల్టర్ ప్యాడ్స్ జోలికి వెళ్ళకూడదు. స్లీవ్స్ విషయంలో ఒకటికి రెండుసార్లు ట్రైల్ చూసి ఏది నప్పితే దాన్ని ధరించాలి. నిలువు చీరలు కొంత సహకరిస్తాయి. నిండురంగు టాప్ లైట్ కలర్ బాటమ్ బావుంటాయి. బోట్ నెక్స్ వైడ్ నెక్ లైన్స్ భుజాల్ని మరింత విశాలంగా చూపే అవకాశాలుంటాయి. న్యారో వినెక్ ఎంచుకోవాలి. నెక్లెస్ లేదా ఇయర్ రింగ్స్ ఆకర్షణీయమైనవి ధరించాలి. కాలర్ లెస్ షర్ట్స్ సూటవుతాయి. ఇది ఉదాహరణ కోసం ఇలాంటి మార్పులతో అందం పెరుగుతోంది అనుకుంటే ఎక్స్ పెర్ట్స్ ని సంప్రదించాలి. సినిమా యాక్టర్స్ ఫోటో షూట్ లతో తేల్చేది ఇదే. వాళ్ళు ఏ యాంగిల్ లో బావుంటారో ఫొటోల్లో తేల్చుకుంటారు.
Categories