సాధారణంగా ఎవరైనా డెలివరీ తర్వాత కాస్తో కూస్తో మారతారు.. బరువు పెరుగుతారు. హార్మోన్ల సమతుల్యత లోపించటం కొవ్వులు పెరగటం ఇంకా ఎన్నో ఇతర కారణాలతో ప్రసవం తర్వాత తేడా వస్తుంది . వెంటనే బరువు తగ్గటం చాలా కష్టం కూడా కానీ బాలీవుడ్ నటి కరీనా కపూర్ మాత్రం ఈ సమస్యను రెండు నెలలోపునే అధిగమించింది. ప్రముఖ డైటీషియన్ రుజుత్  దివేకర్  కరీనా స్లిమ్ గా అయ్యేందుకు డైట్ చార్ట్ ఇచ్చారు. కరీనా కూడా నేను తక్కవ ఏమీ తినలేదు. నెయ్యి వాడాను పిజ్జా లు తిన్నాను పరోటాలు లాగించాను ఆకలేసినంతవరకు తిన్నానన్నారు. కానీ ప్రెగ్నెన్సీ కి ముందు సినిమాల్లో ఉన్నప్పుడు ఆమె ఎలా ఉందో ఇప్పుడు వెంటనే అలంటి షేప్ ;లోకి మారిపోయింది కరీనా. నలుపు రంగు హాఫ్ షోల్డర్ బార్ డాట్ డ్రెస్ ధరించిన కరీనా కపూర్ ఫోటో చూసి అందరూ ఎంత బావుందో అనేసారు. ఏ బ్యూటిఫుల్ మదర్ ని చూసి సైఫ్ ఏమని అంటాడో.. డిసెంబర్ లో మగబిడ్డను జన్మనిచ్చిన కరీనా రెండు నెలలకే రుజుత్ ఆధ్వర్యంలో తిరిగి చక్కగా అయిపోయారు. ఈ క్రెడిట్ అంతా రుజుత్  దే నన్నారు కరీనా…

Leave a comment