కేవలం అందంగా వుంది, డాన్స్ నేర్చుకుని, యాక్టింగ్ స్కూల్లో  పాఠాలు చదువుకున్నంత మాత్రాన అందరు కధానాయికాలు గా రాణించారు. అవన్నీ కేవలం కొన్ని అర్హతలు అంటుంది అనుష్క. భాగమతి చిత్రంలో చాలా బిజీగా వున్నా ఆమె మాట్లాడుతూ, కధానాయికలకు ముందుగా కెమెరా సెన్స్, సైన్స్ రెండు అర్ధం కావాలి. క్రమశిక్షణ చాలా అవసరం. సరిగ్గా టైమ్ కి అటెండ్ అయితేనే యాభై మార్కులు పడతాయి. అటు తర్వాతే గ్లామర్ పరిస్థితులను అవగాహన చేసుకోవడం, సర్దుకుపోవడం నేర్చుకోవాలి. సినిమా  ఏ ఒక్కళ్ళ కృషి మాత్రమే కాదు. ఎన్నో డి పార్ట్ మెంట్స్ కలసి పని చేయాలి. నటీ నటులు ఈ యూనిటీని అర్ధం చేసుకోవాలి. సినీ పరిశ్రమలో ఇవి ప్రాధమిక సూత్రాలు. అనుభవంలో అనుష్క చెప్పుతున్న ఈ సూత్రాలు కొత్తగా ఫీల్డ్ లో కొచ్చిన నటీ నటులు శిరసా వహించాలి.

Leave a comment