Categories

డయాబెటిస్ ను జీవనశైలి మార్చుకోవటం ద్వారా నివారించుకోవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. అనారోగ్యకర ఆహారపదార్థాలు అధిక బరువు ,ఒత్తిడి మొదలైనవి కారణాలుగా చెపుతున్నారు. ఇది జెనటిక్స్ తో ముడిపడి ఉన్నప్పటికీ కుటుంబం వ్యక్తులకు లేకపోయినా వస్తుంది. 30 నుంచి 50 శాతం అవకాశాలను జీవనశైలి మార్చుకుంటే నివారించుకోవచ్చు. పైగా స్థూలకాయం ఒక్కటే డయాబెటిస్ కు కారణం అనుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కొవ్వు నిల్వలు ఉండవచ్చు. వైద్యులను సంప్రదించి ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.