చిన్న పిల్లలకు మేకప్ వేసుకో నివ్వద్దనే అంటున్నారు స్కిన్ కేర్ స్పెషలిస్టులు. ఏ పండుగనో, పుట్టిన రోజుకో వేసిన క్లెన్సర్లు ఉపయోగించకుండా ఆ మేకప్ తీసేయాలి. కొబ్బరి నూనె ,బేబీ ఆయిల్ మొహానికి రాసి మేకప్ తీసేయాలి. రోజు వాళ్ళు స్కూల్ కు వెళ్ళే ముందు స్నానం చేయగానే మాయిశ్చరైజర్ రాసుకోవటం అలవాటు చేయవచ్చు. జిడ్డు చర్మం అయితే జల్ ఆధారిత మాయిశ్చరైజర్ రాసుకోమనాలి. పిల్లలకు ప్రత్యేకమైన సన్ స్క్రీన్ లు ఉన్నాయి. పెదవులు పొడిబారితే పెట్రోలియం జల్లీ రాసి నాణ్యమైన లిప్ బామ్ రాయవచ్చు. పదహారేళ్ళు దాటే వరకు పిల్లలకు మేకప్ వేయకపోవటమే మంచిది.

Leave a comment