రంగు లను చూసినప్పుడు తెలియకుండానే ఆనందం కలుగుతుంది అంటున్నారు థెరపిస్ట్ లు వాతావరణంలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతాయి అంటున్నారు. ఒత్తిడితో సతమతమయ్యే వారి లో కూడా ఈ రంగులు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని కలిగిస్తాయి వర్షాకాలంలో కాస్త మబ్బు ముసిరి ఇల్లు చీకటి గా అనిపిస్తే ఇంటిని వర్ణమయం చేసుకోమంటున్నారు. ప్రకాశవంతమైన ఎరుపు, నారింజ, పసుపు ప్రశాంతతకు సంకేతమైన ఆకుపచ్చ, నీలం ఆనందం కలిగించే లేలేత నీలం గులాబీ ఉదా పీచ్ కలర్ తో ఇంటికి మేకోవర్ చేయమంటున్నారు. రెయిన్ బో, యూనికార్న్ క్యూషన్స్ తో గదికి కొత్త లుక్ తేవచ్చు. ఇంటి నిండా చక్కని పూల అలంకరణతో కలర్ ఫుల్ గా గడిపేయవచ్చు.

Leave a comment