స్కూళ్లు మొదలయ్యాయి పిల్లల లంచ్ బాక్స్ ఏమేం ఉంటే వారికి ఆరోగ్యం అన్న ప్రశ్న ప్రతి తల్లి ముందు నిలబెడుతుంది. పిల్లల ఆహారాన్ని బట్టర్ ఫాయిల్ లో చూటేసి పెడితే పదార్థాలు చెక్కు చెదరవు. పాలు, పెరుగు తో చేసినవి బాక్స్ లో పెట్టక పోవటం మంచిది. ఒక్కసారి అవి పాడైపోతాయి. పళ్ళ ముక్కలు ఉదయాన్నే కట్ చేసి ఎయిర్ టైట్ డబ్బాలో ఫ్రిజ్ లో పెట్టాలి. స్కూల్ కు వెళ్లే ముందు ఈ బాక్స్ బ్యాగ్ లో పెట్టాలి. కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇతర పోషకాలు సమన్వయం చేస్తే పిల్లలకు పోషకాహారం లోపం లేకుండా ఉంటుంది. కార్బోహైడ్రేడ్స్ కోసం అన్నం, నూడుల్స్, పాస్తా, సలాడ్, కిచిడీ, చపాతీ, అటుకులు ఇవ్వచ్చు. ప్రొటీన్స్ కోసం చేపలు, పన్నీర్ చికెన్ కూరగాయలు తాజా పండ్లు డ్రై ఫ్రూట్స్, డేట్స్ తో పిల్లల భోజనం ముగించవచ్చు.

Leave a comment