పాలకూర ఆకుల్ని ఎక్కువ రోజులు తాజాగా వుంచాలంటే కొనగానే పేపర్ టవల్ చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఐదు రోజులు తాజాగా వుంటుంది. అయితే వీలున్నంతవరకు కొన్న మరునాడే వండటం బెటర్. ఆకుల్ని ఐస్ వాటర్ లో ముంచితే మరింత తాజాగా కూర ఆకుపచ్చదనం పోగొట్టుకోకుండా వుంటుంది. బ్రొకోలీని స్టీమ్ చేసి ఆహారంలో భాగంగా తింటే ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సి వుంటుంది. అన్నంలో చాలినన్ని పాలుపోసి బ్లెండ్ చేసి కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వెన్న వేసి రెండు నిమిషాల ఉడక పెడితే ఇన్స్టెంట్ వైట్ సాస్ రెడీ. చాకును మరుగుతున్న నీళ్లలో వుంచి ఛీజ్ కాటేజ్ ఛీజ్ లను కట్ చేయటం వల్ల స్లైసులు పొడి కాకుండా నీట్ గా వుంటాయి. కాచిన పాల గిన్నె పైన చిల్లుల ప్లేట్ వుంచితే మీగడ మందంగా కడుతుంది. పాత్రల నుంచి కోడి గుడ్డు వాసన పోవాలంటే సెనగ పిండి వేడి నీటితో గానీ నిమ్మచెక్క రుద్దిగానీ కడిగేయాలి.
Categories
Wahrevaa

వంటింట్లో ప్రయోగాలు చేస్తున్నారా ?

Leave a comment