88 ఏళ్ళ అబోక్‌ రాధే, మణిపూర్ సాంప్రదాయ వెడ్డింగ్ డ్రెస్ పొట్లోయి సెట్పి ని 58 సంవత్సరాలుగా సృష్టిస్తూనే ఉంది. వీటికి తోడు ప్రసిద్ధి మణిపూరి పౌరాణిక ఖంబాతోయిబి నృత్యానికి కూడా దుస్తులు తయారు చేసి ఇస్తుంది. పొట్లోయి అనిపిలిచే ఈ వెడ్డింగ్ డ్రెస్ తయారీకి స్కర్ట్ లోపలి భాగంలో తొమ్మిది పొరలు వస్త్రం దళసరిగా వచ్చేలా కుడుతారు బియ్యం పిండిలో ముంచి ఆరబెట్టి ఎరుపు గులాబీ ఆకుపచ్చ రంగులో అద్ది  రిబ్బన్లు , రాళ్ళు ,అద్దాలతో  అలంకరించాలి ఎంతో అందమైన ఈ డ్రెస్ ను అబోక్‌ రాధే రూపొందించడమే కాదు ఎంతో మందికి ఈ డ్రస్ తయారీలో శిక్షణ ఇస్తున్నారు. ఈ వయసులో అత్యంత అందమైన డిజైన్లు సృష్టించే ఈ బామ్మ యువతరానికి స్ఫూర్తి .

Leave a comment