పిల్లలు, పిల్లల దాకా ఎందులో యూత్ నోట్లో ఎప్పుడు నలిగేది చూయింగ్ గమ్. వాళ్ళు నమిలేటప్పుడు దాని రుచి సంగతి ఎలా వున్నా అది ఏ డ్రెస్ కైనా అంటితే మాత్రం ఒక పట్టాన వదలదు. ఏ వాషింగ్ కు ఇస్తామన్న దాన్ని చూడ కుండా ఇస్త్రీ చేస్తారేమో అనిపిస్తుంది. కొన్ని చిట్కాలున్నాయి. ఇలా చేస్తే చూయింగ్ గమ్ వుడి వచ్చేస్తుంది. చూయింగ్ గమ్ అంటుకున్న డ్రెస్ ని జిప్ బాగ్ లో పెట్టి డి ఫ్రిజ్ లో ఉంచితే దాన్ని బట్టు ఐస్ గడ్డ కడుతుంది. చూయింగ్ గమ్ అప్పుడు పొడిగా అయిపోతుంది. ఐస్ ముక్క తో కలిపి గట్టిగ లాగితే వుడి వస్తుంది. బాగా మరిగించిన వెనిగర్ లో ఈ గమ్ అంటుకున్నా వస్త్రాన్ని ముంచితే గం వుడి వస్తుంది. గమ్ అంటుకున్న వస్త్రం కింద ఒక పాత వస్త్రం పెట్టి ఇస్త్రీ చేస్తే ఆ గమ్ కింద వున్న పాత బట్ట కి అతుక్కు పోతుంది. హెయిర్ డ్రయ్యర్ తో గమ్ వున్న ప్రాంతం లో వేడి గాలి పెట్టి, అది వేడెక్క గానే చాకు తో తీసేస్తే గమ్ వుడి వస్తుంది.

Leave a comment