పరుపులు దుప్పట్ల పైన పిల్లలు తడిపేసిన మరకలు ఎంత ఉతికినా పోకుండా కనిపిస్తూ ఉంటాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా లిక్విడ్ డిష్ వాష్ మిశ్రమం స్ప్రే బాటిల్లో పోసి మరకలు ఉన్న ప్రదేశం లో తడిపి ఈ మిశ్రమాన్ని చల్లి కాస్త రుద్ది పొడి గుడ్డతో తుడిస్తే పరుపు పైన మరకలు పోతాయి. పరుపుపై రక్తం మరకలు కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్, లిక్విడ్ డిష్ వాష్,ఉప్పు కలిపి మందంగా పేస్ట్ లాగా రాసి ఆరిపోయాక తడి గుడ్డతో తుడిస్తే పోతాయి.

Leave a comment