నటి ప్రియమణి పెటా తో కలిసి కుర్చీలోనే త్రిక్కయిల్ మహాదేవ గుడికి మెకానికల్ ఏనుగు మహాదేవ ను బహుకరించారు. కేరళ లో జరిగే ఎన్నో ఉత్సవాలలో ఏనుగులు పాల్గొంటాయి. వాటిని మాట వినేలా చేసేందుకు మావటి తో వాటిని ఇనుప చువ్వలతో గుచ్చటం తిండి పెట్టకుండా మాడ్చటం వంటి శిక్షలతో అదుపు చేస్తారు ఈ హింస నుంచి ఏనుగులను రక్షించేందుకు ఈ మెకానికల్ ఏనుగు ను బహుకరించింది ప్రియమణి.మూగజీవాలను హింసించకుండా సాంకేతికత సాయంతో సంస్కృతి సంప్రదాయాలు ముందుకు  తీసుకెళ్లాలని ఆలోచనలో ఈ ఏనుగును తయారు చేయించాం అంటుంది ప్రియమణి.

Leave a comment