Categories
పరిశుభ్రంగా తినాలి అంటారు. అంటే ప్లేట్స్ లో ఉన్నవన్నీ వదలకుండా తినటం కాదు. క్లీన్ ఈట్ సరైనా ఆహారపదార్థాల తినాలి అని. అంటే పూర్తి కూరగాయలు పూర్తి ఆహరధాన్యాలు తినాలి. ఉప్పు లేని గింజలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రాసెస్ట్ పదార్ధాలు దగ్గరకు రానివ్వకూడదు. రిఫైన్డ్ చక్కెర పదార్ధాలకు దూరంగా ఉండాలి. పాలకూర ఎన్ని సప్లిమెంట్స్ కంటే చాలా మంచి ఆహారం. ఉదయపు ఉపహారంలో గుడ్డు తీసుకోవాలి. యాడెడ్ చక్కెర తగ్గించి ప్రత్యామ్నాయాలు తీసుకోవాలి. ఆహారం రోజు మొత్తంలో అయిదారు సార్లగా తినాలి. తినే ఆహారంలో పుష్కలంగా పోషకాలు అందాలి. ఇంట్లో వండిన ఆహారం ఒక పరిమితమైన పరిమాణంలో తీసుకోవాలి.