అహ్మద్ తాహెర్ మాకీ అన్న వెటర్నరీ విద్యార్థి ఇరాక్ లో పెంపుడు పిల్లుల కోసం ఓ హోటల్ పెట్టాడు ఈ యువకుడి ఇల్లే హోటల్. ఈ పిల్లుల హోటల్ లో వాటికోసం సకల సదుపాయాలు ఉంటాయి. అవి ఆడుకొనేదుకు మినీ ప్లే గ్రౌండ్,వాటికీ హెల్త్ చెకప్ లు టీవీలు కూడా ఉంటాయి. ఎవరైనా టూర్ లకు ఇతర వేడుకలకు వెలుతూ తమతో తమ పెంపుడు జంతువులను తీసుకువెళ్ళలేని వారు వాటిని ఈ హోటల్లో ఉంచి వెళతారు . తిండి,రూమ్ రెంట్ గా కాస్త డబ్బు చెల్లిస్తే చాలు . ఇరాక్ లో ఇదే మొదటి పిల్లుల హోటల్.

Leave a comment