సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ పిలుపుతో వందలాది మంది కళాకారుల కడుపు నింపింది డాక్టర్ భావన.. విజయవాడకు చెందిన భావన కూచిపూడి కళాక్షేత్రంలో ఎం.ఎ  డాన్స్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కళాకారులకు సాయం చేయటం కోసం పేజ్ బుక్  సృష్టించి రోజుకో కళాకారుని ఇంటర్వ్యూ చేస్తూ వారి కష్టాలను చెప్పించారు. లైవ్ మొదటి రోజునే ఎంతో మంది ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అమెరికా లండన్ నుంచి కూడా సాయం అందింది 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు డాక్టర్ భావన. అన్ని జిల్లాల్లోనూ వాలంటీర్లు ముందుకు వచ్చారు. ఆంధ్ర తెలంగాణ కు సంబంధించి మొత్తం 1400 మంది కళాకారులకు సాయం అందింది ఆమె శారద కళాక్షేత్ర డాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు.

Leave a comment