మోనా సింగ్ నటించిన ఒక వీడియో ఇంటర్నెట్ సంచలనం prega news క్రియేట్ చేసిన ఈ వీడియో ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ బ్రాండ్ కి సంబంధించింది. ‘SHE IS COMPLETE IN HER SELF’ పేరుతో వచ్చిన ఈ ప్రకటన ని 23 లక్షల మంది చూశారు. ఇంకా చూస్తున్నారు మనదేశంలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానం లేనంత మాత్రాన ఆ స్త్రీకి సంపూర్ణత్వం ఉండదా ? అనే విషయం తో తీసిన ఈ యాడ్ వైరల్ అయింది అసలు స్త్రీ గా పుట్టటమే సంపూర్ణత్వం అనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. మనసు కదిలించే ఈ ప్రకటన తప్పకుండా చూడొచ్చు.

Leave a comment