పక్క ప్రణాళికతో నిర్మాణాలు చేపడితే నీటి వనరులను ఎంత బాగా వాడుకోవచ్చో చాటి చెప్పింది దక్షిణ కొరియా .దాదాపు ఏళ్ళ క్రితం ఓ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది .అత్యంత ఆధునిక సాంకేతికత తో కట్టిన సొంగ్డో అనే ఈ నగరం ప్రపంచంలోనే  మొదటి స్మార్ట్ సిటీ. తీరాలు ఉన్న దీవులను కలుపుకొంటూ కట్టిన ఓ కృత్రిమ  దీవి .అన్ని అరవై , డబ్భై అంతస్తుల  భవనాలు ఉంటాయి .భవనం పై కప్పు పైన చుట్టూ మొక్కలతో పచ్చదనం పెంచారు .నగరంలో కురిసిన వాన నీరు ఎక్కడికక్కడ పైపుల ద్వారా నేరుగా భూభాగం లోని ట్యాoకులలోకి వెళ్ళిపోతుంది .ఆ నీటిని శుభ్రం చేసి వాడకం కోసం, సాగుకు పరిశ్రమలకు వాడతారు .కేవలం తాగేందుకే భూగర్భ జలాలను వాడుకొంటారు .చుక్క నీటిని కూడా వృదా చేయకుండా వాడతారు ఈ స్మార్ట్ సిటీలు  .

Leave a comment