నలుగురు ఫ్రెండ్స్ ఎప్పుడూ  మాట్లాడుకుంటే వచ్చే టాపిక్ లు అందరినీ ఇబ్బంది పెట్టె ప్రశ్న ఒకటి ముందుకొస్తూ వుంటుంది. కొందరు స్నేహితులు లేదా చాలా మంది బంధువులు వ్యక్తిగత అంశాలకు సంబంధించి అనేక ప్రశ్నలు వేస్తుంటారు. చెప్పకూడదని కాకపోయినా ఇబ్బందిపెట్టే సందర్భం ఇది. ఈ అనుభవం దాదాపు అందరికీ ఎదురవుతుంది. వ్యక్తిగత కుటుంబ ఆర్ధిక అంశాలన్నీ కూడా ఈ ప్రశ్నల్లో ఉండచ్చు. మామూలు కబుర్లతో ఇలాంటి అంశాలు దొర్లితే పట్టించుకోనట్లు విననట్లు  వదిలేస్తే కొంత మేలు. ఇది ఒకలిద్దరు ఉన్నప్పుడు వీలవుతుంది. లేదా ఇలాంటి ప్రశ్నల తాలూకు అంశాల్ని వదిలేయమని మృదువుగా చెప్పాలి. ఇంకోసారి అడగరూ. కానీ అన్నింటికంటే ముఖ్యం ఇలాంటి సందర్భాన్ని ఖండించే తీరు ఎదుటి మనిషికి నొప్పి కలగకుండా భాంధవ్యానికి ఇబ్బంది రాకుండా వుండాలి. సాధారణంగా మనుషులందరికీ ఎంతో ఉన్నతమైన సంస్కారం వుంటే తప్ప ఇతరుల గురించి కుతూహలం ఎక్కువగానే ఉంటుంది. సంభాషణను పక్కకు మళ్లించే సామర్ధ్యాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. అంతే పరిష్కారం.

Leave a comment