కొన్ని సందర్భాల్లో మనం వాడుతున్న మందులు సురక్షితమూ కాదా వాటివల్ల కలిగే మంచి ఫలితాలతో పాటు అవి చేసే నష్టాన్ని గురించి కూడా మిగతా జాగ్రత్తల తో పాటు డాక్టర్లను తప్పనిసరిగా అడగాలి. ఏదైనా శరీరానికి అసౌకర్యం కలిగితే యాంటీ బయోటిక్స్ వాడక తప్పదు. అయితే యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ తప్పనిసరి వీటిని వేసుకునే ముందు వాస్తవం తెలుసుకోవాలి. గర్భవతిగా ఉంటే బిడ్డకు స్తన్యం ఇస్తూఉంటే వాడే యాంటీ బయోటిక్స్ సురక్షితమా కాదా అడిగి చెక్ చేసుకోవాలి. యాంటీ బయోటిక్స్ తో పాటు వైద్యుడు లాక్టో బిసిల్లస్ గల మందులు ఖాళీ కడుపుతో తీసుకోవచ్చో లేదో అడగాలి. యాంటీ బయోటిక్స్ వాడే సమయంలో యాంటాసిడ్స్ అల్యూమినియం మేగ్నేషియం గలవి లేదా న్యూట్రీషియన్ సప్ప్లమెంట్స్ ఐరన్ జంక్ కాల్షియం గలవి వాడచ్చొ లేదో తెలుసుకోవాలి. ఆల్కహాల్ కొన్నింటికి పడదు ఏమందులు వేసుకొంటున్నా అవగాహన సందేహనివృత్తి అవసరం. నెలసరి రకరకాల హార్మోన్లకు ప్రభావితం అయ్యే స్త్రీల శరీరానికి పడే మందుల విషయంలో తరచి తరచి అడిగినా తప్పులేదు.
Categories