హడావిడి జీవితంలో మంచి భోజనం వండుకునేందుకు కూడా సమయం ఉండదు. పిలల్లు పెద్దలు అందరూ ఇన్స్టెంట్ ఫుడ్ వైపే చూస్తుంటారు. కానీ ఎన్నో ఆహార పదర్ధాల్లో నిల్వ కోసం రంగు రుచి కోసం వాడే ఎడిక్టివ్ లు అసంకల్పితంగా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతూనే ఉంటాయి . పానీయాలు ఐస్ క్రీమ్స్ క్యాండీలు బేక్ చేసిన పదార్ధాలు గెలాటిన్ కిసార్టులు సూప్ బేస్ లు డ్రై ఈస్ట్ డ్రై బ్రేక్ ఫాస్ట్ సెరల్స్ తో వాడే కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఒత్తిడి కాలేయం కిడ్నీ సంబంధిత సమస్యలు కొని తెస్తాయి. ఫ్లేవర్ ను పెంచేందుకు దాదాపు అన్నీ ప్రాసెస్డ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ తో మోనో సోడియం గ్లుకా మెట్ వాడతారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. క్వాన్డ్స్ సీ ఫుడ్ సలాడ్ డ్రెస్సింగ్ ల రుచి రంగు పెంచటానికి వాడే ఐటీడీఏ మజిల్ క్రామ్ప్స్ ఉదర సంబంధిత ఇబ్బందులకు దారి తీస్తుంది. బ్రేడ్ రోల్స్ ఫిల్ట్రీ స్టఫిన్గ్ చాకోలెట్ ఉత్పత్తులు ప్రాసెస్డ్ బ్రేడ్ కేక్స్ ఆర్టీఫీషియల్ స్వీటెస్ట్ జెల్లీ లో వాడే సోడియం కాల్షియం ప్రాపియవేట్ ఎలర్జిక్ రియాక్షన్లకు కారణం అవుతోంది.

Leave a comment