సహజమైన ప్రోబయోటిక్స్ లాక్టిక్ యాసిడ్ గల పెరుగు చర్మానికి శిరోజాలకు ఎంతగానో మేలు చేస్తుందని సౌందర్య పరిరక్షణ కోసం పెరుగు ఉపయోగిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవంటున్నారు పరిశోధకులు. సౌందర్య ఉత్పత్తుల్లో వాడే లాక్టిక్ యాసిడ్ ఆల్ఫా హైడ్రాక్స్  ఆసిడ్స్ లు పెరుగులో ఉంటాయి కనుక పెరుగు శనగపిండి కలిపి మాస్క్ వేసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది అంటున్నారు. పెరుగు మంచి క్లెన్సర్ కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి మెడకు మొహానికి అప్లయ్ చేస్తే చర్మం ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది. కప్పు పెరుగులో అరటిపండు గుజ్జు కలిపి శిరోజాలకు పట్టిస్తే జుట్టు మృదువుగా చిక్కులు పడకుండా ఉంటుంది. అరగంట ఆగి నీటితో కడిగేస్తే సిల్క్ వంటి మెత్తని జుట్టు సొంతం అవుతుంది. ఎండకు చర్మం కమిలి పోయి ట్యాన్ ఏర్పడుతుంది. పెరుగులోని సుగుణాలు సూర్యకిరణాల ప్రభావం ని తొలగిస్తాయి. శనగపిండి పెరుగు కలిపి ఆ నల్లబడిన ప్రాంతంలో అప్లయ్ చేసి ఒక గంట సేపటి తర్వాత కడిగెస్తే ఇన్ఫ్లమేషన్ తగ్గి సన్ టాన్ పోతుంది. ముఖంపై పెరుగు రాయడం వల్ల చర్మం టోన్  సమంగా ఉంటుంది మచ్చలు, స్పాట్స్ పోతాయి. పెరుగులో పసుపు కలిపి మొహానికి అప్లయ్ చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. సౌందర్యాన్ని నిచ్చే పెరుగు వ్యాధినిరోధక శక్తి నిచ్చేది కూడా రోజుకు రెండు వందల ఎం.ఎల్ పెరుగు తింటే యాంటీ బయోటిక్స్ వేసుకొన్న ఫలితం ఉంటుంది అంటున్నారు పరిశోధకులు

Leave a comment