కష్టమొస్తే కలిసి కట్టుగా పనిచేసి దాన్ని దాటేద్దాం అంటున్నారు మధ్యప్రదేశ్లోని రాయ్ సెన్ జిల్లాకు చెందిన మహిళా పోలీసులు .విధులకు హాజరయ్యే వారికి సరిపోయినన్ని మాస్కులు , చేతి తొడుగులు కొరతగానే ఉన్నాయి .దీన్ని అర్ధం చేసుకొన్నారు మహిళా పోలీసుల .విధులు పూర్తి చేసుకొని ఆ తర్వాత తోటి సిబ్బంది కోసం మాస్కులు , చేతి తొడుగులు కుట్టటం మొదలు పెట్టారు .ఆరుగురు కలిసి 2000 మాస్కులు , 450 చేతి తొడుగులు కుట్టేశారు సిబ్బంది అవసరం తీర్చారు .ఈ కష్ట సమయంలో ఏ కొద్దీ సాయమైనా కొండత గానే అర్ధం చేసుకోవాలి .

Leave a comment